న్యూఢిల్లీ: ఏషియన్ బాక్సింగ్ కౌన్సిల్లో భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్సింగ్కు చోటు లభించింది. తన సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన విజేందర్..ప్రతిష్టాత్మక ఏషియన్ కౌన్సిల్లో సభ్యునిగా సేవలందించనున్నాడు.
ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించడంతో పాటు అమెచ్యూర్, ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అపార అనుభవమున్న విజేందర్ సేవలు కౌన్సిల్లో కీలకం కానున్నాయి.