కోల్కతా, జూన్ 16: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలన్నర రోజుల తర్వాత తాను పోటీచేసిన భవానీపూర్ స్థానంలో ఫలితాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం సువేందు అధికారి.. మమతను 15,105 ఓట్ల తేడాతో ఓడించారు.