న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిందితులకు బెయిల్ జారీ చేయడంపై సుప్రీం కోర్టు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. నేరాలను నాలుగు విభాగాలు (ఏ-డీ)గా విభజించింది. నేర తీవ్రత, శిక్ష కాలం బెయిల్ జారీకి ప్రాతిపదిక కావాలని సుప్రీం కోర్టు తన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. దర్యాప్తు సమయంలో నిందితుడి ప్రవర్తనను చూసి ట్రయల్ కోర్టులు బెయిల్ నిరాకరించరాదని సూచించింది. ఈ మార్గదర్శకాలను హైకోర్టుల రిజిస్ట్రార్లకు పంపించింది. వీటిని తర్వాత ట్రయల్ కోర్టులకు పంపనున్నారు.