థానే: మహారాష్ట్రలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న నవీ ముంబై సభలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. చికిత్స పొందుతూ సోమవారం మరో 55 ఏండ్ల వ్యక్తి మరణించాడని అధికారులు తెలిపారు. చికిత్స తీసుకొంటున్న వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. ఆదివారం 11 మంది మృతిచెందారు. సభ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జరుగ్గా.. 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మైదానంలో ప్రజల కోసం పైకప్పు వంటి ఏర్పాట్లు చేయలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ దారుణానికి ఎవరు బాధ్యత వహిస్తారని మాజీ సీఎం, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. సభ నిర్వహణ ప్లానింగ్ సరిగా లేదన్నారు.