భోపాల్ : పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ దుండగుడు మహిళకు పాయింట్ బ్లాక్‌లో గన్‌పెట్టి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని దర్జాగా చెక్కేశాడు. ఈ దౌర్జన్య ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను గమనించిన ఇద్దరు దుండగులు బైక్‌పై ఆమె కంటే ముందే వెళ్లి ఆ రహదారిలోని ఓ మలుపు వద్ద కాపు కాశారు. మహిళ అక్కడికి చేరుకున్న తక్షణమే దుండగుల్లోని ఒకడు బైక్ దిగి ఆమెను నిలువరించాడు. మహిళ, ఆమె వెనక కూర్చున్న వ్యక్తి ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా దుండగుడు తుపాకీతో పాయింట్‌బ్లాక్‌లో బెదిరించి తాపీగా మెడలోని బంగారు గొలుసును తెంపుకొని, దర్జాగా నడుచుకుంటూ వెళ్లి, బైక్ ఎక్కి అక్కడినుంచి చెక్కేశాడు. మహిళపై దాడికి పాల్పడిన సమయంలో అక్కడ ఎవరూ లేరనుకునేరు. పలువురు పాదచారులు, ఆటోలు, వాహనదారులు ఉన్నారు. అయినా దుండగుడు గొలుసు చోరీ చేసుకొనిపోయాడు. సీసీ టీవీ కెమెరాలో దశ్యాలు రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
#WATCH | Madhya Pradesh: Two bike-borne miscreants snatch chain from a woman in Gwalior, in broad daylight pic.twitter.com/dHnvfp2dr8
— ANI (@ANI) August 26, 2021