కొత్త డిజైన్లు తయారు చేయాలి

- కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, జనవరి 27: కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్న తర్వాత కొత్త డిజైన్లతో ఉత్పత్తులను తయా రు చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన మహి ళా సాధికారత సాధించినట్లని చెప్పారు. ఇందు లో భాగంగానే హైదరాబాద్‌లోని రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో మహిళలు కుట్టు పనిలో నైపుణ్యం సాధించడానికి, కొత్త వాళ్లకు కుట్టు శిక్షణ ఇవ్వడానికి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మహిళలకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూ నిట్ ఏర్పాటు, ఇతర రంగాలలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం లో డీఆర్డీవో కాళిందిని, బీసీ సంక్షేమశాఖ అధికారి కృష్ణమాచారి, రాంకీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాంరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, శ్రావణి, శిక్షణ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?