సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 22, 2020 , 05:14:18

సర్వం శివోహం

సర్వం శివోహం

హరహర మహాదేవ.. శంభోశంకర.. నినాదాలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచి శివాలయాల వద్ద సందడి నెలకొన్నది. అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరాలయం, అచ్చంపేట ఉమామహేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు.

  • వైభవంగా మహాశివరాత్రి
  • దారులన్నీ ముక్కంటి సన్నిధికే..
  • అభిషేకాలు, బిల్వార్చనలు, కల్యాణోత్సవాలు
  • శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

హరహర మహాదేవ.. శంభోశంకర.. నినాదాలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచి శివాలయాల వద్ద సందడి నెలకొన్నది. అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరాలయం, అచ్చంపేట ఉమామహేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయాలకు భక్తులు పోటెత్తారు. నల్లమల దారి పొడుగునా శివపంచాక్షరీ నామం మార్మోగింది. శ్రీశైల మహాక్షేత్రానికి భారీగా భక్తులు తరలివెళ్లారు. భౌరాపూర్‌లో జరిగిన భౌరమ్మ, మల్లన్న కల్యాణోత్సవానికి చెంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బుద్ధారం రామలింగేశ్వరుడి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌  


మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి.  ఉదయం నుంచి శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉపవాస దీక్షలు ఉన్న భక్తులు సాయంత్రం శివాలయాలకు వెళ్లి పూజలు చేశారు. శ్రీశైలం, ఉమామహేశ్వరం, సోమశిల, అలంపూర్‌ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భౌరాపూర్‌ జాతరకు చెంచులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. - నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌

VIDEOS

logo