సూర్యాపేట, జనవరి 11 : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్‌రావు అన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో 1వ(ఆర్థిక),7వ (పనులు), 2వ (గ్రామీణాభివృద్ధి), 4వ(విద్య, వైద్యం)స్టాండింగ్ కమిటీల సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఉండదన్నారు. పైప్‌లైన్ సమస్యలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని, ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఏప్రిల్ నాటికి టార్గెట్‌కు మించి పనులు జరుగాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ సురేశ్‌కుమార్, జడ్పీటీసీలు పుల్లారావు, దావుల వీరప్రసాద్‌యాదవ్, జగ్యా, కృష్ణకుమారి, దామోదర్‌రెడ్డి, పద్మ, నర్సయ్య పాల్గొన్నారు.