శాలిగౌరారం, జూన్ 05 : నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని తిరుమలరాయినిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి కంపచెట్లమయంగా మారింది. రహదారికి ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగా కమ్ముకున్నాయి. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. దారి పొడవునా ప్రయాణంలో కంపచెట్లు గీసుకుంటుండంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామంలోని యువకులు పలువురు ఏకమై అడ్డుగా ఉన్న కంప చెట్లను తొలగించి శుభ్రం చేశారు. యువకుల శ్రమను గుర్తించి పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల శివశంకర్, చిలుకూరి ప్రదీప్, ప్రవీణ్, వంశి, గోపిచంద్ పాల్గొన్నారు.