హుజూర్నగర్, అక్టోబర్ 23 : హుజూర్నగర్ పట్టణంలో ఈ నెల 25న ప్రభుత్వ ఆధ్వర్యంలో 250 కంపెనీలతో నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. జాబ్ మేళాకు సంబంధించి పోలీస్ బందోబస్తు, భద్రత ఏర్పాట్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 వేలకు పైగా యువతీ యువకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. యువత నైపుణ్యం ఉన్న రంగం వైపు వెళ్లి విజయం సాధించాలని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ప్రతాప్ లింగం, సర్కిల్ ఎస్ఐలు మోహన్ బాబు, నరేశ్, రవీందర్, బాబు, కోటేశ్ ఉన్నారు.