తుంగతుర్తి, అక్టోబర్ 08 : నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా రాణించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ ఏర్పాటు చేసిన రాయల్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఆయన సందర్శించి మాట్లాడారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూనే ప్రత్యామ్నాయంగా వివిధ వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్ రెడ్డి, తునికి సాయిల్ గౌడ్, గుండగాని దుర్గయ్య, కొండగడుపుల నాగయ్య, కరుణాకర్, గొపగాని రమేశ్, గునిగంటి సంతోష్, ఉప్పుల నాగమల్లు, బొజ్జ సాయికిరణ్, మల్లికార్జున్, మల్లేష్, మధు, సాయి, గోపి, రాజు, ప్రసాద్ పాల్గొన్నారు.