మునుగోడు, ఏప్రిల్ 1 : యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో అశ్వసేన యూత్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
యువత మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మరెందరికో మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీవనపల్లి సైదులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.