గుడిపల్లి, జనవరి 17 : గుడిపల్లి మండలం జి భీమనపల్లి గ్రామ పంచాయతీ ఆవాసం రాయనిపాలెంకు చెందిన యువకుడు విష్ణు(20) ఐటీబీపీ (ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్)కి ఎంపికయ్యాడు. బెల్లికంటి మీనయ్య- నాగమ్మ దంపతుల కుమారుడు విష్ణు. వీరిది నిరుపేద కుటుంబం. కూలి పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నారు. విష్ణు ఇప్పటికే రెండుసార్లు అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు విష్ణుకు అభినందనలు తెలిపారు.