కొండమల్లేపల్లి, అక్టోబర్ 16: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల షాక్తో యువ రైతు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని చింతకుంట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం…మండలంలోని చింతకుంట్ల గ్రామానికి చెందిన జటమోని శ్రీను వెంకటమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు జటమోని వెంకటేశ్(23) చింతకుంట్ల నుంచి రోజూ కొండమల్లేపల్లికొచ్చి ఫ్లంబర్ వర్క్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.
గురువారం ఉదయం పొలంలో వరికి నీరు పెట్టడా నికి వెళ్లగా, 11 కేవీ విద్యుత్ వైరు పొలంలో తెగి ఉండడంతో గమనించని వెంకటేశ్ వైర్లకు తగిలి షాక్తో అక్కడి అక్కడే మృతి చెందాడు. వారం రోజులుగా 11కేవీ విద్యుత్ వైర్లు కిందికి జారి ఉండడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు విద్యుత్ అధికారులకు విన్నవించారు. అధికారులు వైర్లు సరిచేయకపోవడంతో వర్షాల కారణంగా వైర్లు తెగి పొలంలో పడ్డాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిం డు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆరోపించారు.
మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకొచ్చి న్యాయం చేయాలంటూ కొండమల్లేపల్లిలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ అజ్మీర రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ దూదీపాల వేణూధర్రెడ్డి వచ్చి మృతుడి తల్లిదండ్రులకు, న్యా యం జరిగే చూస్తామని నచ్చ చెప్పడంతో గ్రా మస్తులు ధర్నా విరమించారు. మృతుడి తం డ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.