నల్లగొండ రూరల్, జూన్ 18 : శరీరం, మనస్సు క్రోడీకరించడమే యోగా అని ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియో డాక్టర్ తయ్యాబా కౌసర్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణం ఎస్ఎల్బీసీలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో యోగా మాస ఉత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దయనందిన జీవితంలో ప్రతిరోజు ఒక గంట ఆరోగ్యానికి కేటాయించాలని, అందుకోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆహార నియమాలు, శారీరక వ్యాయామం ద్వారా రోగాల భారీ నుండి దూరంగా ఉండవచ్చన్నారు. ఈ సందర్భంగా యోగా గురుజీలు కె.భజరంగ్ ప్రసాద్, సింగం ప్రవీణ్, వైష్ణవి, కోమల పలు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్ వేణుగోపాల్, టీచర్లు కృష్ణ సంజయ్, వరలక్ష్మి, జ్యోతి, పద్మ, నిశాంత్, స్టాఫ్ నర్సు రాము పాల్గొన్నారు.