నల్లగొండ రూరల్, జనవరి 28 : ‘ది నల్లగొండ లారీ అసోసియేషన్’ అధ్యక్షుడిగా నల్లగొండ మండలం కోదండపురం గ్రామానికి చెందిన యెన్న అశోక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా బొడ్డు వెంకన్న గౌడ్, ముఖ్య సలహాదారుగా ఏజస్, సెక్రెటరీగా జావిద్, కోశాధికారిగా మారెడ్డి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రిజ్వాన్, జిల్లాపల్లి శంకర్, జాయింట్ సెక్రెటరీగా వేంపల్లి ప్రభాకర్ రెడ్డి, సభ్యులుగా సుంకిరెడ్డి సత్తిరెడ్డి, దశరథ, ఒట్టే శంకర్, యాదగిరిరెడ్డి, స్వయం పాషా, నర్సింగ్ రవి ను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీని పలువురు సత్కరించి అభినందించారు.