నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 20 : మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నల్లగొండ మండల ఎంపీడీఓ యాకుబ్ నాయక్ ఎన్నికయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా ఎంపీడీఓల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యాకూబ్ నాయక్ తో పాటు ప్రధాన కార్యదర్శిగా చండూరు ఎంపీడీఓ బి.యాదగిరిని ఎన్నుకున్నారు.