రామగిరి, జనవరి 25: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న యాదగిరికి ఉస్మానియా యూని వర్సిటీ డాక్టరేట్(పీహెచ్డీ) అందజేశారు. నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో మహిళా సాధికారిత, రాజకీయ ప్రాతినిధ్యం’ అనే అంశంపై ప్రొఫెసర్ జాడీ ముసలయ్య పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు ఓయూ పీహెచ్డీ పట్టా ప్రదానం చేసింది.
దాంతో బుధవారం ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్‌శ్యాం తన చాంబర్లో అధ్యాపకులు శ్రీలం యాదగిరికి పుష్ప గుచ్ఛం అందజేసి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అంత టి శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.