యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి సాయంత్రం వేళలో ఊంజ ల్ సేవోత్సవాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమపవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు పాల్గొని తరించారు.
లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో ఆలంకారం జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మ వారి ని బాలాలయం ముఖ మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మ వారిని కొనియాడుతూ లాలిపాటలు కోలాహలంగా కొనసాగింది.