ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 29 : మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ క్రీడా పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ జట్టు క్రీడాకారులు కె.మధు, ఎండీ.రెహాన్, ఎ.అభినయ్, ఎల్.మధు పాల్గొని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు సోమవారం ఆత్మకూర్.ఎం మండల కేంద్రంలో మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రతికంఠం పూర్ణచందర్ రాజు, ఎంఈఓ కొత్త మహాదేవరెడ్డి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన మండలి అధ్యక్షుడు దొంతరబోయిన మురళీకృష్ణ , కబడ్డీ కోచ్లు ఉప్పలయ్య, సూర్యం పాల్గొన్నారు.