భువనగిరి అర్బన్, డిసెంబర్ 21: తండాల్లో సమస్యలను పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా మంగళవారం మండలంలోని సూరెపల్లి, ఆకుతోటబావితండా, పచ్చర్లబోడుతండ, రెడ్డినాయక్తండాల్లో పర్యటించారు. సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల పనులను త్వరలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు. తాగునీరు, సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వీధి దీపాలు, బీటీ రోడ్లు, గ్రామాలకు లింకురోడ్లు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, పాఠశాలల పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపారు. వార్డుల్లో సీసీరోడ్లు వేస్తానని చెప్పారు. పచ్చర్లబోడుతండాలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధానకార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, కేశవపట్నం రమేశ్, పంతులు నాయక్, సందెల సుధాకర్, మహేందర్‌నాయక్, సామల వెంకటేశం, గునుగుంట్ల కల్పనాశ్రీనివాస్, పడాల వెంకటేశ్వర్లు, పెద్ది బుచ్చిరెడ్డి, చిన్నం పాండు, కొండూరి సత్యనారాయణగౌడ్, సిలువేరు మధు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బోరు పరిశీలన
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సరైన నీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి దృష్టికి కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి తీసుకెళ్లారు. వెంటనే మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులును ఎమ్మెల్యే ఆదేశించడంతో సోమవారం రాత్రి బోరు వేయించి మోటర్‌ను బిగించారు. ఈ పనులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. మోటర్ నుంచి పాఠశాల వరకు పైప్‌లైన్ వేయించాలని ఆదేశించారు.
ఇంటికి పెద్దదిక్కుగా సీఎం కేసీఆర్
భువనగిరి అర్బన్ : పేదింటి కుటుంబానికి పెద్దదిక్కుగా ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆర్థిక సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.
బుధవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలంలోని 89 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు తన సొంతంగా పోచంపల్లి దుస్తులను పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుండగా, ధాన్యం కొనబోమని బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నదని విమర్శించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, అతికం లక్ష్మీనారాయణ, భాషబోయిన రాజేశ్, ర్యాకల శ్రీనివాస్, పాశం మహేశ్, సిలువేరు మధు, బాత్క అశోక్ పాల్గొన్నారు.