
భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు24: నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా గౌస్‌కొండ, రామలింగంపల్లి, జలాల్పూర్, మెహర్‌నగర్, దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా గౌస్‌కొండ గ్రామంలో పల్లె పర్యవేక్షణ కార్యక్రమంలో భాగం గా రూ.40లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు , రూ.20 లక్షలతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైకుంఠధామాన్ని ప్రా రంభించారు. రామలింగంపల్లి గ్రామంలో రూ.15 లక్షల తో చేపట్టనున్న సీసీరోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వల పనులకు, అంతమ్మగూడెంలో రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
జలాల్పూర్లో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, అంతర్గత మురుగునీటి కాల్వ పనులకు , రూ.7.50 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి శంకుస్థాపన చేశారు. మెహర్‌నగర్ గ్రా మంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దోతిగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్లు కందాడి భూపాల్‌రెడ్డి, అందెల లింగంయాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లావణ్యాదేవేందర్‌రెడ్డి, రమావత్ రాములునాయక్, రజితామల్లారెడ్డి, స్వప్నారామ్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాధవరెడ్డి, భిక్షపతి, ఎంపీటీసీలు అమృతమ్మాధర్మారెడ్డి, శ్రీదేవిపాల్గొన్నారు.
నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన
బీబీనగర్, ఆగస్టు24: మండలంలోని చిన్నరావులపల్లి, భట్టుగూడెం, రామునిగుండ్లతండా, రావిపహాడ్‌తండా, రావిపహాడ్ గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృ ద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.