ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత ఎంపీపీ, సర్పంచ్‌లకు లేదు..
ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత ఎంపీపీ శ్రీశైలం, వంగపల్లి సర్పంచ్ కానుగు కవితకు లేదని గ్రామ ఉప సర్పంచ్ రేపాక స్వామి, ఎంపీటీసీ రేపాక మౌనిక అన్నారు
- వంగపల్లి ఉప సర్పంచ్ రేపాక స్వామి, ఎంపీటీసీ మౌనిక
యాదాద్రి, డిసెంబర్14: ప్రొటోకాల్‌పై మాట్లాడే అర్హత ఎంపీపీ శ్రీశైలం, వంగపల్లి సర్పంచ్ కానుగు కవితకు లేదని గ్రామ ఉప సర్పంచ్ రేపాక స్వామి, ఎంపీటీసీ రేపాక మౌనిక అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచి మంత్రి హోదాలో ఉన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా గ్రామంలో పాఠశాలలో అభివృద్ధి పనులు, చిన్నకందుకూరులో బతుకమ్మ చీరెల పంపిణీని ఎంపీతో ప్రారంభించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 12 మంది గ్రామపంచాయతీ వార్డు సభ్యులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీపీ, సర్పంచ్ తీరుపై మండిపడ్డారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి ప్రొటోకాల్ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. వంగపల్లి సర్పంచ్‌గా కానుగు కవిత ఎన్నికైన నాటి నుంచి ఆమె భర్త కానుగు బాలరాజు సర్పంచ్‌గా వ్యవహరిస్తూ గ్రామ పంచాయతీ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
పంచాయతీలో 12 మంది వార్డులను ఇబ్బందికి గురిచేస్తున్నారని, వారి వార్డుల్లో పనులకు సైతం సహకరించడం లేదని వాపోయారు. ప్రభుత్వ విప్ గొంగిడి దంపతులు 8 ఏండ్లలో తమ సొంత గ్రామమైన వంగపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ స్టేషన్, రూ. కోటితో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, సుమారు 800మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు గుర్తు చేశారు. గ్రామంలో రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలు ప్రభుత్వ విప్ కృషితోనే సాధ్యమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రజలకం దించే బాధ్యత ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై ఉందన్నారు. ఆరోపణలు మానుకోకపోతే ఊరుకోమని హెచ్చరించారు. సమావే శంలో వార్డు సభ్యులు కానుగు సంధ్యారాజు, ఆకుల సంతోష, కానుగు పద్మ, రజినీ, గవ్వల సిద్ధులు, ఎడపెల్లి వెంకటేశ్, ఆంజనేయులు, గాయత్రిమహేశ్, బండి మహేశ్, కవితావెంకటేశ్, రాణాప్రతాప్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

