మోత్కూరు, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల స్వరూపం మారిపోయిందని జిల్లా బీసీ సంక్షేమాధికారి, మండల ప్రత్యేకాధికారి పి.యాదయ్య అన్నారు. ఐదో విడుత పల్లె పగ్రతిలో భాగంగా మండలంలోని పాలడుగు, పొడిచేడు, దత్తప్పగూడెం గ్రామాల్లో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో వన నర్సరీలు, ఇంకుడు గుంతలు, మంచినీటి ట్యాంకుల శుభ్రం పనులను పరిశీలించారు. దాచారం, అనాజిపురం, సదర్శాపురం, పనకబండ, రాగిబావి గ్రామాల్లో అధికారులు పల్లె ప్రగతి పనులు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, ఎంపీఓ రావూఫ్ అలీ, సర్పంచులు మరిపెల్లి యాదయ్య, పేలపుడి మధు, ఎలుగు శోభాసోమయ్య, అండెం రజిత, బత్తిని తిరుమలేశ్, రాంపాక నాగయ్య, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వలిగొండ : పల్లె ప్రగతిలో భాగంగా 4వ రోజు గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించి పారిశుధ్య పనులు చేపట్టారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కంచనపల్లి, రెడ్లరేపాక, దాసిరెడ్డిగూడెం గ్రామాల్లో ఎంపీడీఓ గీతారెడ్డి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమాల్లో సర్పంచులు రేపాక అరుంధతి, కొమిరెల్లి రమాబాలకృష్ణారెడ్డి, ఎంపీఓ కేదారీశ్వర్, ఏపీఓ శ్రీలక్ష్మి, ప్రత్యేకాధికారులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి
అడ్డగూడూరు : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తాసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి అన్నారు. అడ్డగూడూరు, బొడ్డుగూడెం, చిన్న పడిశాల గ్రామాల్లో సోమవారం పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయో గుర్తించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మండల ప్రత్యేకాధికారి కృష్ణ, సర్పంచ్ కొప్పుల సోమిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి
బీబీనగర్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని మహదేవ్పూర్ గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలతోపాటు పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను, వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.