రాజాపేట, ఏప్రిల్ 19 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామంలో పిడుగుపాటుతో బండి మల్లయ్యకు చెందిన 50 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం మృతిచెందిన జీవాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లయ్యను ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఫోన్ చేసి మల్లయ్యను అందుకోవాలని, ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలని కోరారు.