రాజాపేట, జనవరి 19 : రాజాపేట మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ఈ నెల 21న నిర్వహించే భక్త మార్కండేయ జయంతి ఉత్సవ కరపత్రాలను సోమవారం మండల కేంద్రంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు ఆడెపు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆడపు శ్రీశైలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కండేయ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను గ్రామంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు బిర్రు బాలకిషన్, ఆడెపు రాజు, సహాయ కార్యదర్శి బల్ల కృష్ణ, కోశాధికారి చుంచు నారాయణ, సభ్యులు స్వర్గం బాలకిషన్, పొట్టబత్తిని వెంకటేష్, నాయకులు ఆడపు రామకృష్ణయ్య, పొట్టబత్తిని నరేందర్, సకినాల ఉపేందర్ పాల్గొన్నారు.