ఆలేరు టౌన్, మే 27 : ఈ నెల 31న హైదరాబాద్లో నిర్వహించే టీజేఎఫ్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జూకంటి అనిల్, ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో టీజేఎఫ్ శ్రేణులతో కలిసి మంగళవారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అల్లం నారాయణ నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25వ రజతోత్సవ సభను హైదరాబాద్ జలవిహార్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు టీజేఎఫ్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మండల గౌరవ అధ్యక్షుడు జూల శ్రీధర్. మండల అధ్యక్షుడు గుండు మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరె భానుప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి దడిగే రమేశ్, సీనియర్ జర్నలిస్టులు దూడల సాగర్ గౌడ్, సిరిగిరి స్వామి, మల్లిగారి శ్రీనివాస్, సీస సాయిరాం, చింతకింది వెంకటేశ్వర్లు, గుండు మధుసూదన్, అరె సాయిగౌడ్, సుధీర్ పాల్గొన్నారు.