ఆత్మకూరు(ఎం), నవంబర్ 21 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ముందుండాలని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షురాలు ఏనుగు వాణి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదరంగం క్రీడా బోర్డులను అందజేశారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. చదరంగం క్రీడతో మేధస్సు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, ఎంఈఓ కొత్త మహాదేవరెడ్డి, న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం చైర్మన్ జిన్నా రాజేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రమ, వైస్ చైర్మెన్ ఏనుగు లక్ష్మీ నరసింహ రెడ్డి, చెస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ హరి, పాండురంగారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కందాడి దశరథ రెడ్డి, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.