యాదగిరిగుట్ట, జూన్ 21 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం దర్శించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి ఆయన స్వయంభూ పంచనారసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వాద మండపంలో అర్చకులు, వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ జిల్లా అధికారి పి.యాదయ్య, తాసీల్దార్ గణేశ్ నాయక్ పాల్గొన్నారు.