ఆలేరు టౌన్, జూలై 25 : ఆలేరు పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో నెలకొన్న పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుడు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పత్తి వెంకటేశ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమ సంఘం నుండి నవజీవన్ బీడీ ఫ్యాక్టరీ వరకు డ్రైనేజీ పనులను పూర్తి చేసి, దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తూ పాదచార్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. కావునా వాటిని నేలమట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేటి అజయ్, ఎండీ గోరెమియ, సీసా ప్రవీణ్, మూర్తాల సంతోష్ రెడ్డి, ఎస్కే మహమూద్, ఎండీ ఫయాజ్, నరేశ్, కాలనీవాసులు పాల్గొన్నారు.