– మోటకొండూర్ ఎస్ఐ కుమారస్వామి యాదవ్
– మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన
మోటకొండూర్, ఆగస్టు 26 : రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తేనే ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయని మోటకొండూర్ ఎస్ఐ కుమారస్వామి యాదవ్ అన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు, ప్రజలకు బుధవారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. రహదారులపై వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. రహదారిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్ఐ కోరారు.