ఆలేరు టౌన్, జూలై 17 : ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ గురువారం వినతిపత్రం అందజేసింది. గురువారం ఆలేరు ఆర్య వైశ్య భవన్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఆలేరులోనే వై ఎస్ ఎన్ గార్డెన్లో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్‌ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు.
అనంతరం కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆలేరులో ఈ నెల 22న నిర్వహించే బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ పశుపునూరి వీరేశం, నాయకులు ఆర్.జనార్ధన్, మొరిగాడి చంద్రశేఖర్, చెక్క వెంకటేశ్, కల్లెపు అడివయ్య, నంద గంగేశ్, కెమిడి ఉప్పలయ్య, పంగ రవి, నాయకులు ఎండీ సలీం, మొరిగాడి రమేశ్, బేజాడి కుమార్, చిరబోయిన కొమురయ్య, చిరబోయిన రాజయ్య, అంజిబాబు పాల్గొన్నారు.