చౌటుప్పల్, జులై 03 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరాంరెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో పాటు ట్రినిటీ హైస్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలన్నారు. ఇందుకోసం అందరూ క్లాత్ సంచులు వినియోగించి పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ టి.రఘుపతి, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజినీర్ రేణుకుమార్, ట్రినిటి స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, ప్రిన్సిపాల్ ఉజ్జిని మంజుల పాల్గొన్నారు.