ఆలేరు టౌన్, మే 29 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో ఓ పెండ్లి వేడుకలో ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం ఆలేరు మండల ఫొటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా స్టూడియోలు బంద్ చేసి ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ.. పెళ్లిళ్లలో ఫొటోగ్రాఫర్లు తమ వృత్తి రీత్యా పని చేసుకుంటండగా కస్టమర్లకు సంబంధం లేకుండా ఇతర వ్యక్తులు మద్యం సేవించి వచ్చి మొబైల్ లో ఫొటోలు తీయాలని వాగ్వివాదానికి దిగుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం, భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఇలాంటి దాడులను అరికట్టి, దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల మండలాధ్యక్షుడు రాయపురం నరసింహులు, ప్రధాన కార్యదర్శి కోల నరేశ్, ఫోటోగ్రాఫర్లు ఇప్పకాయల ప్రభాకర్, శనిగరం శ్రీనివాస్, ఆకుబత్తిని ప్రభాకర్, గుండు మధుసూదన్, సీసా రాజేశ్, అశోక్, వెంగల్ దాసు శ్రీకాంత్, గంజి వెంకటేశ్, చింతల ఉదయ్, వట్టపల్లి శివ, వినయ్, భరత్ కుమార్, ఈశ్వర్ పాల్గొన్నారు.