భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 31 : నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్ నియమితులైన విషయం తెలిసిందే. పద్మశాలి ముద్దుబిడ్డ చంద్రశేఖర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్‌పల్లి. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న 2018 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బడుగు చంద్రశేఖర్ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో నల్లగొండ కలెక్టర్‌గా వచ్చారు. 2023, జూలై 19 నుండి సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తూ పాలనపై మంచి పట్టు సాధించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా చంద్రశేఖర్ రావడం పట్ల భూదాన్ పోచంపల్లి మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.