యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడు వడ్లకొండ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.