Krishnudu | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో నటుడు కృష్ణుడు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో చైత్ర రాయ్ ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. రెండో వారం నామినేషన్స్‌లో సుధీర్, సృష్టి, కృష్ణుడు చివరి వరకు ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. వీరిలో కృష్ణుడికి తక్కువ ఓట్లు రావడంతో నాగార్జున ఆయన ఎలిమినేషన్‌ను ప్రకటించారు. దీంతో దాదాపు రెండు వారాల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కృష్ణుడి ప్రయాణం ముగిసింది.హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కృష్ణుడు పెద్దగా చురుగ్గా కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా టాస్కుల్లో ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువగా పాల్గొనడం, ఎక్కువగా సైలెంట్‌గా ఉండటం ఆయన ఆటకు ప్రతికూలంగా మారిందనే చర్చ జరిగింది.
వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా కృష్ణుడి ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హౌస్‌లో ఉంటూ కేవలం టీవీ చూస్తున్నట్లుగా ఉండకూడదని సూచించారు. ఆటలో చురుగ్గా పాల్గొని తనను తాను నిరూపించుకోవాలని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత కూడా కృష్ణుడు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయారని, ఓటింగ్‌లోనూ వెనుకబడ్డారని తెలుస్తోంది. చివరకు తక్కువ ఓట్ల కారణంగా ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇక కృష్ణుడికి బిగ్ బాస్ షో ద్వారా అందిన పారితోషికంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయనకు వారానికి సుమారు రూ.3 లక్షల వరకు పారితోషికం అందినట్లు ప్రచారం జరిగింది. ఈ లెక్క ప్రకారం దాదాపు రెండు వారాలు హౌస్‌లో ఉన్నందుకు సుమారు రూ.6 లక్షల వరకు పారితోషికం అందుకుని ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే కృష్ణుడి అసలు పారితోషికానికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెల్లడికాలేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. అయితే బిగ్ బాస్ హౌస్‌లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎక్కువ రోజులు కొనసాగాలని భావించిన కృష్ణుడు.. రెండో వారంలోనే ఎలిమినేట్ కావడం గమనార్హం. హౌస్‌లో తనలోని మరో కోణాన్ని చూపించేందుకు అవకాశం వచ్చినప్పటికీ.. ఆ అవకాశాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. కృష్ణుడు ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో దేబ్జానీ, టెంపర్ వంశీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి సౌందరాజన్, సృష్టి, ముఖేష్ గౌడ, సుధీర్ రెడ్డి, రోహిత్, సింగర్ ఝాన్సీ, అమన్, చరణ్, షాలిని తదితర కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు. ఇక మూడో వారంలో నామినేషన్స్, టాస్కులు, కెప్టెన్సీ పోటీలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.