బీబీనగర్, నవంబర్ 18 : బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 339లో ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ (ఎస్ఎన్ఆర్ ఇన్ఫ్రా) ఏర్పాటు చేసిన వెంచర్లో అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చి వేశారు. ఈ అక్రమ కట్టడాలపై గూడూరు గ్రామానికి చెందిన జేరిపోతుల నాగేశ్ గతంలో హెచ్‌ఎండిఏతో పాటు కలెక్టర్, పంచాయతీ కార్యాలయాల్లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు స్థలాన్ని పరిశీలించి వెంచర్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై బాధ్యులకు నోటీసులు అందించారు. నోటీసులపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో హెచ్ఎండిఏ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపిఓ వినూత్నారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మాజిద్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది వెంచర్‌లోని అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చి వేశారు. వెంచర్ చిన్నేరు వాగుకు అతి సమీపంలో ఉండడం బఫర్ జోన్ లో పార్కును ఏర్పాటు చేయడంతో పార్కును బఫర్ జోన్ లో ఎలా ఏర్పాటు చేస్తారంటూ హెచ్ఎండిఏ అధికారులు చర్యలు చేపట్టారు.

Bibinagar : గూడూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు