ఆలేరు టౌన్, ఆగస్టు 14 : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు మండలాధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆలేరులోని రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించే వారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హార్ ఘర్ తిరంగాతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుని వారి విగ్రహాలను శుద్ధి చేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగలాగా జరుపుకోవాలన్నారు.
విభిన్న మతాలు, కులాలు ఉన్న దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం భారతదేశమే అన్నారు. అంతకుముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా జిల్లా కో కన్వీనర్ కామిటికారి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి దశరథ, జిల్లా కౌన్సిల్ మెంబర్ బర్ వడ్డెమన్ నరేందర్, భోగ శ్రీనివాస్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు ఏలగల వెంకటేశ్, శేషత్వ అమరేందర్, నాయకులు సుభాష్, బైరి మహేందర్ గౌడ్, వడ్డేపల్లి కిషన్, పంపరి లక్ష్మీనారాయణ, కళ్లెపు యాదగిరి, ఐలి సందీప్, ద్వారపు రమణ, పూల హనుమంతు, గాజుల సారయ్య, కృష్ణమూర్తి, సుక్కరాజు, గడ్డం సందీప్, కోళ్ల సందీప్, గిరిపోయిన పరశురాములు, శ్రావణ్ కుమార్, రవితేజ, భరత్, విద్యార్థులు పాల్గొన్నారు.