సెల్‌ఫోన్ రిపేర్ విషయంలో గొడవ.. వ్యక్తి హత్య
సెల్‌ఫోన్ రిపేర్| యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో సీతయ్య(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆరితోటి సీతయ్య, పాలూరు కొండయ్యలు వంగపల్లిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో కొండయ్య తన మొబైల్ ఫోన్ రిపేర్ కోసం సీతయ్యను రూ.3 వేలు అడిగాడు. దీనికి సీతయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సీతయ్య తన ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా.. గొడవను మనసులో పెట్టుకున్న కొండయ్య ఒక ఇనుప రాడ్ తీసుకొని వెళ్లి నిద్రిస్తున్న సీతయ్య తలపైన బలంగా కొట్టాడు. దీంతో సీతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు కొండయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కోర్టు వద్ద హత్య కేసు నిందితుడి చేయి నరికివేత.. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తులు
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
‘కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలి’
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

