‘టీఆర్పీ బహిరంగ సభను విజయవంతం చేయండి’
జూలై 5న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో..
భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : జూలై 5న భువనగిరి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఆర్పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజా గౌడ్, రాష్ట్ర నాయకుడు పిట్టల శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో బిసి సంక్షేమం, రిజర్వేషన్లపై తీన్నార్ మల్లన్న పోరాటానికి బిసి ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధించాలని, బీసీ సమాజానికి రాజ్యాధికారం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. ఇది ఒక బీసీ ఆత్మగౌరవ గర్జన అని, తెలంగాణ భవిష్యత్‌ను నిర్ణయించే ఉద్యమ వేదిక అని తెలిపారు. భవిష్యత్ హక్కులు, రాజ్యాధికారం కోసం రాజ్యాధికార సమరభేరీకి బీసీ సోదరులంతా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ మల్కాజిరి అధ్యక్షురాలు శాలిని, ఉపాధ్యాయులు సౌభాగ్య, కార్యదర్శి వనజ, ప్రధాన కార్యదర్శి కోట్ల వాసు, అంజన్ కుమార్ యాదవ్, టీఆర్పీ మండల కన్వీనర్ ముద్దం సత్యం యాదవ్, బిసి నాయకులు, చింతకింది రమేష్, మైసగోని వెంకటేశం పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..!
KING Movie | క్రిస్మస్ కానుకగా షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. కొత్త పోస్టర్ విడుదల.!
Amritsar: గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ సర్పంచ్ సోదరుడి కాల్చివేత
Hyderabad | హైదరాబాద్‌లో మయన్మార్ మహిళపై అఘాయిత్యం.. స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్!
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

