సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 04 : యాదాద్రి భువనగిరి జిల్లా నుండి రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల కళాశాల అధ్యాపకురాలు కొండ కవిత ఎంపికయ్యారు. కొండ కవిత సర్వేలు గురుకుల కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకోనున్నారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపిక కావడంతో కళాశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.