బీబీనగర్, ఆగస్టు 04 : చదువుతోనే విజ్ఞానం, గౌరవం పెంపొందుతుందని రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ జి.ఉషారాణి అన్నారు. సోమవారం బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల లోపాలను సరిచేస్తూ చదువులో రాణించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సురేశ్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి పాల్గొన్నారు.