రాజాపేట, మార్చి 22 : చేనేత రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతూ శనివారం భువనగిరి జౌళి శాఖ అధికారికి రాజాపేట మండల పద్మశాలి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పవర్ లూమ్స్ సంబంధించిన ద్రీప్టు డబ్బులు, గత 18 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న అమౌంట్ వెంటనే చెల్లించాలన్నారు.
అలాగే పవర్ లూమ్స్ కూడా ద్రీప్టు పద్ధతిని అమలు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృషి చేనేత మ్యాక్స్ సొసైటీ రాజపేట ఉపాధ్యక్షుడు చుంచు నారాయణ, పిట్టల వెంకటేశం, ఎలగందుల శ్రీనివాసులు, రఘునాథపురం పద్మశాలి సంఘం నాయకుడు బింగి రమేశ్ పాల్గొన్నారు.