రాజాపేట, ఆగస్టు 06 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల – రాజాపేట అధ్యాపకుడు బామండ్ల రాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌కు ఎంపికయ్యాడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీల జంగయ్య కవిత్వం సమగ్ర అంశంపైన వెలుదండ నిత్యానందరావు పర్యవేక్షణలో ఆయన చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది. ఈ నెల 19న ఓయూలో జరగనున్న 84వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డా.వి. నారాయణన్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోనున్నాడు.
రాజు ఓయూ నుంచి పీజీ తెలుగు, యూజీసీ నెట్ పరీక్షలో ఆల్ ఇండియా టాప్ టెన్ లో నిలిచి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌నకు ఎంపియ్యాడు. గురుకుల పీజీటీ తెలుగు పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 12వ ర్యాంక్, టీఆర్టీలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 8వ ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా గురుకుల జేఎల్ తెలుగు పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.