మోత్కూరు, మే 14 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని ఐకేపీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు 17 శాతం లోపు తేమ వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నారు.
ధాన్యాన్ని శుభ్రం చేసి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. గన్ని బస్తాల కొరత లేదని, ధాన్యం త్వరగా తూకాలు చేయడం ఆ తర్వాత ఎగుమతి చేసి రైస్ మిల్లులకు తరలించినట్లయితే ఆ ధాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మండల తాసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ధాన్యం ఆరబెట్టుకుని ఉన్న రాశులను ఆయన పరిశీలించారు.