– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
– పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ
భూదాన్ పోచంపల్లి, జూలై 20 : చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ అభివృద్ధి, మార్కెటింగ్ సౌకర్యాల విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ పదవీ బాధ్యతలు స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ కేంద్రంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ ప్రముఖుడు పద్మశ్రీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, నేతన్న విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన భారత లవ కుమార్, నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం, చేనేత కార్మికులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలి శాఖ ఏడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, మాజీ ఎంపీపీ బడుగు దానయ్య, పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, బిజెపి రాష్ట్ర నాయకుడు కర్నాటి ధనంజయ, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, టై అండ్ డై అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పద్మశాలి చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, మార్కండేశ్వర దేవాలయ చైర్మన్ సీత సత్యనారాయణ, నాయకులు పిల్లలమర్రి శ్రీనివాస్, కౌన్సిలర్ సురపల్లి రాధికా రమేశ్, పోచంపల్లి చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు సీత శ్రీశైలం, కార్యదర్శి సూరపల్లి శ్రీనివాస్, కోశాధికారి కోడి భిక్షపతి, డైరెక్టర్లు కడవేరు చంద్రమౌళి, గంజి బసవలింగం, మహేశ్వరం నాగమణి, పాలాది జ్యోతి యాదగిరి, వివిధ సంఘాల అధ్యక్షులు, పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

‘చేనేత కార్మికుల సంక్షేమo కోసం ప్రభుత్వం కృషి’