ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆమె మాట్లాడుతూ..
భువనగిరి, నవంబర్ 12 : ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆమె మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వెంటనే ఐకేపీ సెంటర్ ద్వారా గానీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని, ఈరోజు అదే రైతు మళ్లీ గోస పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అధికారులు కూడా తప్పకుండా ఒక హెల్ప్ లైన్ నంబర్‌ను ప్రకటించాలన్నారు. తద్వారా రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే సమాచారం ఇవ్వగానే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు వస్తే ధాన్యం తడిచి పోయి మొలకలు వస్తాయి కాబట్టి వెంటవెంటనే కొనుగోలు చేయాలన్నారు. అక్టోబర్ 3వ వారంలోనే వడ్ల కొనుగోలు ప్రారంభం జరగాలి కానీ ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో కొనుగోలు ప్రారంభం కాకపోవడం విచారకరం అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కట్టింగులకే ఉపయోగపడుతున్నాయే తప్ప వడ్ల కొనుగోలు ఏమాత్రం ప్రారంభం కావట్లేదన్నారు. కావునా త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సునీత డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

