Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
Man pushed Woman Under train | లోకల్ ట్రైన్లో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. ఒక స్టేషన్లో రైలు దిగిన ఆమె అతడిని ప్రతిఘటించింది. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తి యువతిని తోయడంతో రైలు కింద పడింది. లోకల్ ట్రైన్ అప్పుడే కదలడంతో ఆమె చేయి తెగిపోయింది.
ముంబై: లోకల్ ట్రైన్లో ప్రయాణించిన మహిళను ఒక వ్యక్తి వేధించాడు. ఒక స్టేషన్లో రైలు దిగిన ఆమె అతడిని ప్రతిఘటించింది. వాగ్వాదం సందర్భంగా ఆ వ్యక్తి యువతిని తోయడంతో రైలు కింద పడింది. లోకల్ ట్రైన్ అప్పుడే కదలడంతో ఆమె చేయి తెగిపోయింది. (Man pushed Woman Under train) మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 4న సాయంత్రం వేళ ఒక యువతి గోరేగావ్‌లో ఉన్న తన సోదరిని కలిసింది. నైగావ్ ఈస్ట్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు లోకల్ ట్రైన్లో ఆమె ప్రయాణించింది.
కాగా, లోకల్ ట్రైన్లో ఒక వ్యక్తి ఆ యువతిని వేధించేందుకు ప్రయత్నించాడు. సాయంత్రం 7:15 గంటల సమయంలో నైగావ్ రైల్వే స్టేషన్లో రైలు దిగిన తర్వాత వారిద్దరి మధ్య దీని గురించి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తన చెప్పును అతడిపైకి విసిరింది. ప్రతిగా ఆ వ్యక్తి కూడా తన చెప్పును ఆమెపైకి విసిరాడు. అలాగే ఆ యువతిని బలంగా రైలు పట్టాల వైపు తోశాడు.
మరోవైపు అదుపుతప్పిన ఆ యువతి, రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ నుంచి పట్టాలలోకి పడింది. ఆమె తిరిగి ప్లాట్‌ఫారమ్‌పైకి ఎక్కలేకపోయింది. ఆ లోకల్ ట్రైన్ అప్పుడే కదలడంతో ఆ యువతి ఎడమ చేయి తెగిపోయింది. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. ఆ యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైల్వే పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు ఆ రైల్వే స్టేషన్‌తో పాటు పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరకు నవంబర్ 9న ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Mumbai – A 20-year-old woman suffered the amputation of her left arm after she was allegedly molested aboard a crowded Mumbai suburban local train and then pushed from the train near Naigaon railway station in the Mira-Bhayandar area. According victim’s the incident occurred on the evening of November 4 while she was travelling from Borivali toward Virar. Due to the crowd, she had entered a compartment reserved for persons with disabilities. A fellow passenger allegedly began touching her inappropriately. When she objected and confronted him, an argument broke out. The confrontation continued as the train reached Naigaon station, where the man allegedly pushed her out. She fell into the gap between coaches; as she tried to get back onto the platform, the train started moving and her left arm was trapped under the wheels. She also sustained head injuries requiring stitches and was later treated at Cooper Hospital. The accused has been identified as 53-year-old. He fled the scene but was subsequently arrested by the Bhayandar Railway Police after examination of CCTV footage. A case was registered under relevant sections of the Bharatiya Nyaya Sanhita related to outraging a woman’s modesty, voluntarily causing grievous hurt, and other offences; some reports indicate attempted murder charges were also applied.
— NextMinute News (@nextminutenews7) November 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

