రామన్నపేట, డిసెంబర్21 : సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 54 మందికి కల్యాణ లక్ష్మి, 9మందికి సీఎం సహాయనిధి, ఐదుగురికి ఎస్సీ సబ్సిడీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. క్రిస్టియన్లకు ప్రభుత్వం ఇచ్చిన క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం నిధానపల్లి గ్రామంలో వైకుంఠధామం, రూ.5లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బీజేపీ తట్టుకోలేక కుట్ర చేస్తున్నదని అన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు, టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్నా మోదీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. స్థానిక మల్లన్నగుట్ట అభివృద్ధికి పాటుపడతానని, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ నుంచి నిధానపల్లి వరకు ఫీడర్ చానల్ ఏర్పాటు చేయిస్తానని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 50శాతం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్‌ను అందిస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో నీర్నెముల గ్రామానికి చెందిన సుర్వి స్వామి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేంధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుత్తా నర్సిరెడ్డి, టీఆర్ఎస్ మండలాఅధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం, మందడి రవీందర్‌రెడ్డి, కన్నెబోయిన అయిలయ్య, సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, అంతటి పద్మారమేశ్, పిట్ట కృష్ణారెడ్డి, రేఖాయాదయ్య, ఉప్పు ప్రకాశ్, కోళ్ల స్వామి, కడమంచి సంధ్యాస్వామి, ముత్యాల సుజాత, యాదాసు కవిత, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, వనం హర్షిణి, గోగు పద్మాసత్తయ్య, దోమల సతీశ్, గాదె పారిజాత, బడుగు రమేశ్, ఎండీ ఆమేర్, పార్టీ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయికుమార్, కంభంపాటి శ్రీనివాస్, మందడి శ్రీధర్‌రెడ్డి, బద్దుల రమేశ్, జాడ సంతోష్ పాల్గొన్నారు.